Anant Radhika: రాధికా మర్చంట్ కు తాళికట్టిన అనంత్ అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ

Update: 2024-07-13 03:05 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. అనంత్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన నారింజ రంగు షేర్వానీ ధరించారు. తన నివాసం యాంటిలియా నుంచి సుందరంగా అలంకరించిన ఎరుపు రంగు కారుపై సంగీతం, నృత్యాల మధ్య ఊరేగింపుగా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.

ఈ వివాహంలో ప్రముఖ దిగ్గజాలు, సెలెబ్రిటీలు, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియాన్, ఆమె సోదరి ఖోలే, నైజీరియన్ రాపర్ రెమా, UK మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, సౌదీ అరామ్‌కో CEO అమిన్ నాసర్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ, GSK plc చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎమ్మా వామ్స్‌లీతో సహా గ్లోబల్ బిజినెస్ టైకూన్‌లు ఈ పెళ్ళికి హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్, అలియా భట్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, రజనీకాంత్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ హాజరయ్యారు.


Tags:    

Similar News