హీరోయిన్ అనుష్క శెట్టి సోదరుడిని చంపేస్తామంటూ బెదిరింపులు

అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్‌ శెట్టి హత్యకు ప్రత్యర్థులు పథకం పన్నినట్లు

Update: 2022-06-13 10:22 GMT

అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్‌ శెట్టి హత్యకు ప్రత్యర్థులు పథకం పన్నినట్లు కన్నడ మీడియా చెబుతోంది. ప్రముఖ మాఫియా డాన్ ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్‌ రై, గుణరంజన్‌శెట్టిలు కుడి, ఎడమ భుజంలా ఉండేవారు. ముత్తప్ప రై మరణించిన తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ ప్రత్యర్థులుగా మారారు. ముత్తప్పరై స్థాపించిన జయ కర్ణాటక సంఘం నుంచి గుణరంజన్‌ బయటకు వచ్చి జయకర్ణాటక జనపర వేదికను స్థాపించారు. మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. తాజాగా మన్విత్‌ రై తమ నేత హత్యకు కుట్ర పన్నాడని గుణరంజన్‌ అనుచరులు ఆరోపించారు. ఆదివారం రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్‌కు భద్రత కల్పించాలని కోరారు. ఈ ఆరోపణలను మన్విత్‌ రై తోసిపుచ్చారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గుణరంజన్ శెట్టికి హత్య బెదిరింపులు రావడంతో భద్రత కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. తమకు రక్షణ కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గుణరంజన్ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయకర్ణాటక జనపర వేదిక సభ్యులు వినతిపత్రంలో కోరారు.

మన్విత్‌ రై మాత్రం తాను విదేశాల్లో ఉంటున్నానని, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేని తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.


Tags:    

Similar News