నాగాలాండ్ లో చెలరేగిన హింస
నాగాలాండ్ లో ఆర్మీ జవాన్లు పౌరులపై జరిగిన కాల్పులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఘటనలో మొత్తం 17 మంది మరణించారు
నాగాలాండ్ లో ఆర్మీ జవాన్లు పౌరులపై జరిగిన కాల్పులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఘటనలో మొత్తం 17 మంది మరణించారు. వీరిలో 16 మంది పౌరులు కాగా, ఒక జవాను ఉన్నారు. దీంతో గ్రామస్థులు ఆర్మీ క్యాంప్ పై ఎదురు దాడికి దిగారు. ఈ సందర్భంగా హింస చెలరేగింది. అనేక మంది జవాన్లు గాయపడ్డారు. ఆర్మీకి చెందిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓటింగ్ లో సైనిక శిబిరంపై పౌరులు దాడి చేశారు.
క్షమాపణలు చెప్పినా....
దీంతో ఆర్మీ గ్రామస్థులకు క్షమాపణలు చెప్పింది. ఉగ్రవాదులు అనుకుని వాహనంపై వస్తున్న గ్రామస్థులపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరపడంతో ఈ దుర్ఘటన జరిగింది. దీనిపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. 17 మంది మృతిపై సమగ్ర విచారణ జరపాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డిమాండ్ చేశారు. ఇంకా నాగాలాండ్ లో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలివేశారు.