మరో కొత్త వైరస్.. కేరళలో తొలి కేసు నమోదు

తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన యువకుడిని వైద్యులు పరీక్షించగా.. మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించాయి. అతడికి వైద్య పరీక్షలు చేయగా

Update: 2022-02-10 11:50 GMT

నిన్న మొన్నటి వరకూ.. దేశ ప్రజలను కరోనా, ఒమిక్రాన్ వేరియంట్లు వణికించాయి. ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంపో హమ్మయ్యా ! కరోనా తగ్గుతోంది అనుకునేలోపే.. మరో వైరస్ కలకలం రేపుతోంది. దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ అలజడి రేపుతోంది. కేరళలో తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైంది. వయనాడ్ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో ఉండే 24 ఏళ్ల యువకుడికి మంకీ ఫీవర్ నిర్థారణ అయింది.

తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన యువకుడిని వైద్యులు పరీక్షించగా.. మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించాయి. అతడికి వైద్య పరీక్షలు చేయగా.. మంకీ ఫీవర్ నిర్థారణ అయింది. ప్రస్తుతం మనంతవాడీ మెడికల్ కాలేజీలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. బాధిత యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేరళలో తొలి మంకీ ఫీవర్ నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా.. రెండేళ్ల క్రితం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ మండలం అరళగోడు గ్రామంలో మంకీ ఫీవర్ తో 26 మంది మృతిచెందారు.


Tags:    

Similar News