Ayodhya : అయోధ్య ఆలయ వేళల మార్పు
లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో ఆలయ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుం
అయోధ్య రామాలయానికి భక్తులు క్యూ కడుతున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో ఆలయ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ వేళలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది.
భక్తుల సంఖ్య పెరగడంతో...
ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని రామాలయంలో విగ్రహ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల వరకూ, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఏడు గంటల వరకూ మాత్రమే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే భక్తులు ఎక్కువ మంది రావడంతో ఆలయ ట్రస్ట్ బోర్డు ఆలయ వేళలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో భక్తులు బాలరాముడిని దర్శించుకునే వీలు కలుగుతుంది.