నేడు భోపాల్‌కు మోదీ
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ వరస పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ వరస పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ను మళ్లీ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ప్రధాని ఇప్పటికే నెలన్నర రోజుల్లో మూడో సారి మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇందుకు బీజేపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ తన అడ్డాగా భావిస్తుంది. అక్కడ తమ గెలుపు ఖాయమని నమ్ముతుంది.
వరస పర్యటనలతో...
కానీ గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ఓటమి పాలు కావడంతో మధ్యలో కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా ను పార్టీలోకి తీసుకువచ్చి అధికారాన్ని దక్కించుకుంది. ఈసారి మాత్రం తిరిగి గెలిచేందుకు సర్వశక్తులు కమలం పార్టీ ఒడ్డుతోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు భోపాల్ లోని జంబోరిలో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన జైపూర్‌కు చేరుకుంటారు. మహాకుంభ్‌లోనూ ప్రసంగించనున్నారు.