అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అధికారిక బంగ్లా

Update: 2023-08-14 06:58 GMT

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అధికారిక బంగ్లా అద్దాలు ఆదివారం సాయంత్రం గుర్తుతెలియ‌ని పగలగొట్టార‌ని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒవైసీ ప్రభుత్వ బంగ్లా వద్ద ఉన్న కేర్‌టేకర్.. బంగ్లా అద్దాన్ని ఎవరో పగలగొట్టారని ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ అంశంపై విచారణ జరుగుతోంది.

పోలీసుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 34 అశోకా రోడ్‌లోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటి గేటు అద్దాన్ని ఎవరో పగలగొట్టారు. పీసీఆర్‌కు కాల్‌ అందడంతో డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కుక్క లోపలి నుండి మొరగడంతో.. బయటికి వెళ్లి గేటు వద్ద పగిలిన గాజును గుర్తించిన‌ట్లు ఒవైసీ బంగ్లా సేవకుడు రోహిత్ చెప్పాడు. చూడగానే, కిటికీ అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో నేను చుట్టూ చాలా వెతికాను.. కానీ ఎవరు కనిపించలేద‌ని తెలిపాడు.

అంతకుముందు ఫిబ్రవరి 19న ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని దుండగులు ఆయన ఢిల్లీ నివాసం పైకి రాళ్లు రువ్వారు. కిటికీలను ధ్వంసం చేశారు. ఘటన అనంతరం ఒవైసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని తన నివాసంపై కొందరు గుర్తుతెలియని దుండగులు రాళ్లు రువ్వారని ఒవైసీ తన ఫిర్యాదులో ఆరోపించారు. దేశ రాజధానిలోని తన నివాసంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని.. 2014 తర్వాత ఇది నాలుగో ఘటన అని ఒవైసీ ఫిబ్రవరిలో పేర్కొన్నారు.


Tags:    

Similar News