సీఎం కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు..

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలు కేంద్రం బయటపెట్టాలని రాహుల్​ గాంధీ డిమాండ్​ చేయటంలో తప్పేమీ లేదని, ఇప్పుడు తాను కూడా

Update: 2022-02-15 11:24 GMT

ఇటీవల తెలంగాణ సీఎం సర్జికల్ స్ట్రయిక్స్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ అసోం బీజేపీ కార్యకర్తలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసీఆర్ పై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించిన కేసీఆర్.. సర్జికల్ స్ట్రయిక్స్ కు ప్రూఫ్ కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అసోం సీఎం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్​పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని వదిలిపెట్టనన్నారు.

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలు కేంద్రం బయటపెట్టాలని రాహుల్​ గాంధీ డిమాండ్​ చేయటంలో తప్పేమీ లేదని, ఇప్పుడు తాను కూడా ఆ ఆధారాలను అడుగుతున్నానని తెలిపారు. దాంతో కేసీఆర్ దేశ వ్యతిరేక భావాలను ప్రోత్సహిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అసోం బీజేపీ కార్యకర్తలు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా స్పందించారు. భారత సైన్యం ధైర్య సాహసాలపై ఇప్పటివరకూ ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవన్నారు. సైన్యంపై నమ్మకం ఉన్నవారందరికీ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదిస్తాడని, వారంతా దేశంపై, సైన్యంపై నమ్మకాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు.


Tags:    

Similar News