ఫిబ్రవరి 15 నుంచి స్కూల్స్ రీపెన్ !

కొన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే.. కరోనా కేసులు

Update: 2022-02-02 07:51 GMT

కరోనా, ఒమిక్రాన్ ల విజృంభణ నేపథ్యంలో భారత్ లోని చాలా రాష్ట్రాల్లో గల విద్యాసంస్థలకు భారీ ఎదురుదెబ్బే తగిలింది. అసలే సిలబస్ పూర్తవ్వక విద్యార్థులు ఇబ్బందిపడుతుంటే.. కరోనా కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించక తప్పలేదు. తెలంగాణ సహా.. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, అసోం తదితర రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్నిరాష్ట్రాల్లో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే.. కరోనా కేసులు తగ్గుతుండటంతో స్కూల్స్ రీపెన్ పై నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Also Read : ఒమిక్రాన్ ఉపరకంపై డబ్ల్యూహెచ్ఓ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆంక్షలు ఎత్తివేయడంపై ?

కొన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే.. కరోనా కేసులు తగ్గుతుండటంతో స్కూల్స్ రీపెన్ పై నిర్ణయాలు తీసుకుంటున్నాయి.కొన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే.. కరోనా కేసులు తగ్గుతుండటంతో స్కూల్స్ రీపెన్ పై నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Also Read : పీఆర్సీ సాధన సమితి అత్యవసర సమావేశం... హైకోర్టుకు

తాజాగా.. అసోంలో పాఠశాలలను ఫిబ్రవరి 15వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కరోనా కేసులు మరింత తగ్గితే.. మున్ముందు కర్ఫ్యూ సమయాల్లో కూడా సడలింపులు చేస్తామని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం అసోంలో రోజువారి కరోనా కేసుల సంఖ్య 2 వేలుగా ఉంది. ఇప్పటి వరకు 15 నుంచి 18 ఏళ్లలోపు ఉన్న 9 లక్షల మంది పిల్లలకు టీకాలు వేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.




Tags:    

Similar News