Supreme Court : పతంజలికి సుప్రీంకోర్టు మరోసారి అక్షింతలు
ఆయుర్వేద సంస్థ పతంజలి సంస్థకి మరోసారి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది
ఆయుర్వేద సంస్థ పతంజలి సంస్థకి మరోసారి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ప్రజలను తప్పుపట్టించే విధంగా ప్రకటనలు ఇచ్చారని వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగా రాందేవ్ బాబా తరుపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదించారు. ఇప్పటికే రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారని, 67 ప్రధాన న్యూస్ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారని తెలిపారు. క్షమాపణలు చెబుతూ ఇచ్చిన ప్రకటన చిన్న సైజు ఇవ్వడంపై సుప్రీీంకోర్టు అభ్యంతరం తెలిపింది. రానున్న విచారణకు బాలకృష్ణ, రాందేవ్ బాబా ఇద్దరూ హాజరు కావాలని ఆదేశించింది.
ప్రకటనలపై...
అయితే ఆయుర్వేద సంస్థ పతంజలి తమ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల సైజులోనే యాడ్స్ ఇచ్చారా? అని పతంజలి తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్స్ పై ప్రకటనలు ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో పతంజలి ప్రాడక్ట్స్ కు చెందిన బాలకృష్ణ, రాందేవ్ బాబాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి విచారణ వాయిదా వేసింది.