నేటి నుంచి అయ్యప్ప ఆలయం మూసివేత
శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని నేటి నుంచి మూసి వేయనున్నారు.
శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని నేటి నుంచి మూసి వేయనున్నారు. మధ్యాహ్నం పూజలు అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారని కమిటీ తెలిపింది. మూడు రోజుల తర్వాత తిరిగి తెరవనున్నారు. డిసెంబరు 30వ తేదీన తిరిగి సాయంత్రం ఐదు గంటలకు మకరవిళక్కు పర్వదినం కోసం అయ్యప్ప ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. అనంతరం మకర సంక్రాంతి రోజు వరకూ ఆలయం తెరిచే ఉంటుంది. జ్యోతి దర్శనం పూర్తయిన తర్వాత తిరిగి జనవరి 20వ తేదీన ఆలయాన్ని మూసివేస్తారు.
30 లక్షల మంది భక్తులు...
అయితే కేవలం మండల పూజల సమయంలో స్వామి వారికి 223 కోట్ల ఆదాయం వచ్చింది. 39 రోజుల్లోనే ఈ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కమిటీ వెల్లడించింది. ఈ సారి చిన్నారులు అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనానికి వచ్చారని అధికారులు తెలిపారు. నవంబరు 17నమండల పూజలు ప్రారంభం కాగా లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.అనంతగోపన్ చెప్పిన వివరాల ప్రకారం భక్తులు నేరుగా సమర్పించిన కాలుక విలువ 70.15 కోట్లు ఉంది. ఈ 39 రోజుల్లో 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు.