నేటి నుంచి రెండు రోజులు బ్యాంకులు బంద్
ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణకు నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు దిగాయి.
ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణకు నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు దిగాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు దిగుతున్నట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. సమ్మెకు దిగవద్దని యాజమాన్యం సూచించినా తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగారు.
చర్చలు విఫలం కావడంతో....
ఈ సమ్మెలో సుమారు తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటారని యూనియన్ తెలిపింది. సమ్మె నోటీసుపై యాజమాన్యం బ్యాంకులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటారని యూనియన్ నేతలు చెప్పారు. ఖాతాదారులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని వారు పేర్కొన్నారు.