నేడు కూడా బ్యాంకులు బంద్
ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణకు నిరసనగా బ్యాంకు సిబ్బంది నేడు కూడా సమ్మె చేయనున్నాయి. నేడు బ్యాంకులు బంద్ కానున్నాయి.
ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణకు నిరసనగా బ్యాంకు సిబ్బంది నేడు కూడా సమ్మె చేయనున్నాయి. నేడు కూడా బ్యాంకులు బంద్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రెండు రోజుల పాటు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం రెండు రోజుల సమ్మెకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.
రైతుల తరహాలో...
ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటీకరిస్తే ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని బ్యాంకు యూనియన్లు చెబుతున్నాయి. 2000 సంవత్సరం నుంచి తాము ఈ ప్రతిపాదనను అడ్డుకుంటూనే ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో రైతుల మాదిరి తాము ప్రభుత్వ బ్యాంకులను రక్షించుకుంటామని యూనియన్లు చెబుతున్నాయి. రెండో రోజు కూడా బ్యాంకులు సమ్మె చేస్తుండటంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు.