సెప్టెంబర్ లో 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు
సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏకంగా 13 రోజులు మూతపడనున్నాయి. ఇదేదో సమ్మె కారణం అనుకునేరు. ఆర్బీఐ బ్యాంకులకు..
మరో మూడ్రోజుల్లో ఆగస్టు నెల ముగిసి, సెప్టెంబరు నెల రాబోతోంది. సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏకంగా 13 రోజులు మూతపడనున్నాయి. ఇదేదో సమ్మె కారణం అనుకునేరు. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చిన సెలవులివి. తరచూ లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టు తిరిగే కస్టమర్లకు సెప్టెంబర్ నెల కాస్త ఇబ్బంది పెట్టనుంది. బ్యాంకులకు వచ్చిన సెలవుల్లో రెండు ఆదివారాలు, రెండు శనివారాలున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్లో బ్యాంకులకు 8 సెలవులుండగా.. వివిధ ప్రాంతాల్లో అక్కడి ఆచారాలను పాటించేందుకు సెలవులు ఉన్నాయి. వారాంతాల్లో సెలవులు మినహా, మిగతా సెలవులు ఆర్బీఐ "నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్" పరిధిలోకి వస్తాయి.
• సెప్టెంబర్ 1న గణేష్ చతుర్థి (2వ రోజు) సందర్భంగా పనాజీలో బ్యాంకులు మూసివేయబడతాయి.
• సెప్టెంబర్ 4న నెలలో మొదటి ఆదివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
• సెప్టెంబర్ 6న కర్మ పూజ జరుపుకోవడానికి రాంచీలోని బ్యాంకులు మూసివేయబడతాయి.
• సెప్టెంబర్ 7న మొదటి ఓనం సందర్భంగా కొచ్చి మరియు తిరువనంతపురంలోని బ్యాంకులు మూసివేయబడతాయి.
• సెప్టెంబర్ 8న తిరువోణం సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయబడతాయి.
• సెప్టెంబర్ 9న ఇంద్రజాత్రను పురస్కరించుకుని గాంగ్‌టక్ బ్యాంకులు మూసివేయబడతాయి.
• సెప్టెంబర్ 10న రెండవ ఆదివారం.
• సెప్టెంబర్ 18న మూడవ ఆదివారం.
• సెప్టెంబర్ 21న శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా, కొచ్చి మరియు తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయబడతాయి.
• సెప్టెంబర్ 24న నాలుగో శనివారం.
• సెప్టెంబర్ 25న నాల్గవ ఆదివారం.
• సెప్టెంబర్ 26న లైనింగ్ థౌ సనామహీకి చెందిన నవరాత్రి స్థాప్న/ మేరా చౌరెన్ హౌబా సందర్భంగా ఈ తేదీన ఇంఫాల్, జైపూర్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి.