మరో మూడు రోజులు భయం భయంగానే బెంగళూరు
బెంగళూరు వర్షం కురిస్తేనే వణికి పోతోంది. రాత్రి కురిసిన వర్షానికి మరోసారి బెంగళూరు నగరంలో వర్షపు నీరునిలిచిపోయింది;
బెంగళూరు నగరం వర్షం కురిస్తేనే వణికి పోతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి మరోసారి బెంగళూరు నగరంలో వర్షపు నీరునిలిచిపోయింది. భారీ వర్షానికి ప్రజలు భయపడి పోయారు. బెంగళూరు నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలు నీట మునిగాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో పాటు బెంగళూరు వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
భారీ వర్షాలకు...
కాలనీలన్నీ చెరువుల్లాగా మారాయి. మేజిస్టిక్ సెంటర్ వద్ద గోడ కూలడంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. వర్షం కురుస్తుందంటేనే బెంగళూరు వాసులు బితుకు బితుకుమంటూ కాలం గడుపుతున్నారు. ఆకాశం మేఘా వృతమైతే చాలు బిత్తర చూపులు చూస్తు నిల్చుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో మూడు రోజుల పాటు బెంగళూరుకు భారీ వర్షాలు అని ప్రకటించడంతో భయపడి పోతున్నారు.