Pragna Singh Takkur:వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమెతో ప్రధాని మోదీ ఏమన్నారంటే?
భోపాల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్
Pragna Singh Takkur:భోపాల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆమెను పోటీలో నిలపకూడదన్న పార్టీ నిర్ణయంపై ఆమె స్పందించారు. గతంలో తన మాటల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ సంతోషించకపోవచ్చని.. తనను క్షమించబోనని ప్రధాని మోదీ చెప్పారని ఆమె అన్నారు. బీజేపీ నిర్ణయంపై మీడియాతో మాట్లాడిన ఆమె, “నేను ఇంతకు ముందు టికెట్ కోరలేదు, ఇప్పుడు కూడా కోరడం లేదు. నా గత ప్రకటనల్లో కొన్ని పదాలను ఉపయోగించడం వల్ల ప్రధాని మోదీకి నచ్చకపోయి ఉండవచ్చు. నన్ను క్షమించనని అన్నారు. నా వ్యాఖ్యలకు నేను ఇంతకు ముందే ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాను."
మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. భోపాల్ సిట్టింగ్ ఎంపీ స్థానంలో మాజీ మేయర్ అలోక్ శర్మను నియమించారు. ప్రగ్యా ఠాకూర్ పార్టీ నిర్ణయాన్ని అంగీకరించారు.. టికెట్ ఎందుకు నిరాకరించారనే దానిపై దృష్టి పెట్టనని తెలిపారు. మహాత్మా గాంధీపై ప్రగ్యా ఠాకూర్ గతంలో చేసిన వ్యాఖ్యలతో తాను సంతోషంగా లేనని 2019లో ప్రధాని మోదీ చెప్పడం కూడా తెలిసిందే. నాథూరామ్ గాడ్సేను 'నిజమైన దేశభక్తుడు' అని గతంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ప్రశంసించి వివాదాన్ని రేకెత్తించారు. మహాత్మా గాంధీ హంతకుడిని నిజమైన దేశభక్తుడిగా పేర్కొన్నందుకు సాధ్వి ప్రగ్యాను తాను ఎప్పటికీ క్షమించనని ప్రధాని మోదీ అన్నారు.