తమిళంలో బోర్డులు లేకుంటే రూ.2 వేల జరిమానా

తమిళనాడులోని దుకాణాల, సంస్థల పేర్ల బోర్డులు తమిళంలో లేకుంటే ఫైన్ ను రూ. 50 నుంచి రూ.2000 లకు పెంచుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

Update: 2023-09-03 10:33 GMT

తమిళంలో బోర్డులు లేకుంటే రూ.2 వేల జరిమానా

తమిళనాడులోని దుకాణాల, సంస్థల పేర్ల బోర్డులు తమిళంలో లేకుంటే ఫైన్ ను రూ. 50 నుంచి రూ.2000 లకు పెంచుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. దీనిపై మరో రెండు వారాల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనానికి తెలియజేసింది.

ఈ విషయంపై 2017లో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయట్లేదని సామాజికకార్యకర్త తిరుమురుగన్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, జీఆర్ స్వామినాథన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీని అమలుపై స్టాటస్ రిపోర్టు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Tags:    

Similar News