హుటాహుటిన ఛత్తీస్ గఢ్ నుంచి చెన్నైకు కిషన్ రెడ్డి
ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిలుపు వచ్చింది;

ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఆయనను అర్జెంటుగా చెన్నై రావాలంటూ పిలుపు రావడంతో హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ఛత్తీస్ గఢ్ లో నేడు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఆయన అటు నుంచి అటే చెన్నైకు బయలుదేరి వెళ్లారు.
అమిత్ షా పిలుపు మేరకు...
చెన్నైలో నేడు అమిత్ షా పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తమిళనాడు అధ్యక్ష ఎంపికతో పాటు ఎన్నికల్లో గెలుపు, పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలో కిషన్ రెడ్డిని హుటాహుటిన బయలుదేరి రమ్మన్నారని తెలిసింది. నేడు పొత్తులతో పాటు అధ్యక్ష ఎంపకపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.