నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు పది వేల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది;

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు పది వేల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. రైల్వే శాఖలో మొత్తం 9,970 పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ ను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు జారీ చేసింది. ఈ పోస్టులకు విద్యార్హతలుగా పదో తరగతితో పాటు సంబంధిత ఐటీఐ లేదా ఇంజినీరంగ్, లేదా డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులుగా నిర్ణయించారు.
అర్హులందరూ...
అభ్యర్థుల వయసు ఈ ఏడాది జులై ఒకటో తేదీ నాటికి పద్దెనిమిది నుంచి ముప్ఫయి సంవత్సరాల మధ్యలో ఉండాలి. రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికేట్ పరిశీలనతో పాటు రాత పరీక్ష కూడా ఉండనుంది. దీనికి సంబంధించి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డుకు సంబంధించిన వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.