తమిళనాడులో కుదిరిన పొత్తులు
తమిళనాడులో పొత్తులు కుదిరాయి. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి;

తమిళనాడులో పొత్తులు కుదిరాయి. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లయింది. నేడు తమిళనాడులో పర్యటించిన అమిత్ షా అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామితో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
గతంలోనూ అత్యధిక స్థానాలు...
గతంలో అన్నాడీఎంకే, బీజేపీ కలసి తమిళనాడులో 30 లోక్ సభ నియోజకవర్గాల్లో గెలిచినట్లు అమిత్ షా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తమిళనాడులో భారీ మెజారిటీతో గెలుస్తుందని అమిత్ షా చెప్పారు. పళనిస్వామి నాయకత్వంలో అందరం కలసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామని అమిత్ షా మీడియాకు వెల్లడించారు.