నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా తీవ్రత దృష్ట్యా రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలను నిర్వహించనున్నారు. వచ్చే నెల 14వ తేదీ వరకూ మొదటి విడత సమావేశాలు జరగనున్నాయి.
రాష్ట్రపతి ప్రసంగంతో.....
నేడు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేవం ముగుస్తుంది. తర్వాత ఐదు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. రేపు నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. కరోనా కారణంగా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తారు. రాజ్యసభ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకూ, లోక్ సభ సాయంత్రం నాలుగు గంటల నుంచి 9 గంటల వరకూ జరుగుతుంది. రేపు మాత్రం బడ్జెట్ కావున ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం అవుతుంది.