ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్

ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాలు

Update: 2023-09-08 11:21 GMT

ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాలు గెలుచుకుంది. ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్, ఉత్తరప్రదేశ్ లోని ఘోసీ, కేరళలోని పుత్తుపల్లి, త్రిపురలోని బాక్సానగర్, ధన్‌పుర్, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, ఝార్ఖండ్‌లోని దుమ్రి అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఉప ఎన్నికలు జరిగాయి. భాగేశ్వర్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి బసంత్ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి పార్వతిదాస్ విజయం సాధించారు. త్రిపురలోని రెండు అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. బాక్సానగర్ సీటును బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హోసైన్, ధన్‌పుర్ నుంచి బీజేపీకి చెందిన బిందు దేవ్‌నాథ్ గెలిచారు. బాక్సానగర్‌లో 66 శాతం మంది మైనార్టీ ఓటర్లు ఉండగా బీజేపీకి 34,146 ఓట్లు, సీపీఎం అభ్యర్థికి 3,909 ఓట్లు వచ్చాయి. ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ధన్‌పూర్‌లో కూడా బీజేపీ 18,871 ఓట్ల మెజార్టీతో గెలిచింది.

ధూప్‌గురి నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ సమీప బీజేపీ అభ్యర్థి తపసి రాయ్‌పై 4వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. పుత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ 37,719 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చాందీ ఊమెన్ 36,454 ఓట్ల తేడాతో సీపీఎం అభ్యర్థి జైక్ సి థామస్ పై గెలుపొందారు. దివంగత మాజీ సీఎం ఊమెన్ చాందీ కుమారుడైన ఆయనకు 78,098 ఓట్లు రాగా, సీపీఎం అభ్యర్థి జైక్ సీ థామస్ కు 41,644 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లిగిన్ లాల్ కు 6,447 ఓట్లు వచ్చాయి.యూత్ కాంగ్రెస్ జాతీయ ఔట్ రీచ్ సెల్ చైర్మన్ గా ఉన్న 37 ఏళ్ల చాందీ ఊమెన్.. తన తండ్రి ఐదు దశాబ్దాలకు పైగా అసెంబ్లీకు ప్రాతినిధ్యం వహించిన పుత్తుపల్లి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తండ్రి కంటే భారీ మెజారిటీతోనే గెలుపొందారు.


Tags:    

Similar News