భారత్ లో బీఎఫ్-7 వేరియంట్ కేసులు ఎన్నంటే?

భారత్ లో బీఎఫ్ 7 వేరియంట్ కేసులు నాలుగుకుచేరాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది

Update: 2022-12-22 06:29 GMT

భారత్ లో బీఎఫ్ 7 వేరియంట్ కేసులు నాలుగుకుచేరాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటి వరకూ భారత్ లో నాలుగు ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్, ఒడిశాలలో ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలు కరోనా నిబంధనలను పాటించేందుకు సిద్ధమవుతున్నాయి. మాస్క్ లను ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి.

ఈరోజు కరోనా వైరస్ బారిన...
ఇక భారత్ లో ఈరోజు 185 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.72 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.01 శాతంగానే ఉంది. ఇప్పటివరకూ భారత్ లో 4,46,76,515 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 5,30,681 మంది కరోనా కారణంగా మరణించారు.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు3,402 కేసులు మాత్రమే ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారిన పడి 4,41,42,432 మంది చికిత్స పొంది కోలుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యశాఖ అధికారులు కోరుతున్నారు. లేకుంటే ప్రమాదం తప్పదన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News