అసద్ కాన్వాయ్ పై కాల్పులు జరిపింది అతడే
ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన వారిలో ఒకరిని పట్టుకున్నారు
ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. అసద్ కు చెందిన వారే ఈ దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి నుంచి 9ఎంఎం పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు ఉపయోగించిన బైక్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి నోయిడా కు చెందిన సచిన్ గా పోలీసులు గుర్తించారు.
స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందే....
మీరట్ నుంచి కిట్టోర్ తాను వెళ్లానని, కిట్టోర్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఈ కాల్పులు జరిగాయని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కాన్వాయ్ పై దాడి జరిగినట్లు తన వద్ద ఉన్న వారు చెప్పారన్నారు. ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. తన కాన్వాయ్ లో నాలుగు వాహనాలు ఉన్నాయని అసద్ చెప్పారు. ఎన్నికల కమిషన్ ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.