మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు;

cbi in telugu states
ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. భూపేష్ భఘేల్ ఇంటిపై ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మరోసారి భూపేష్ భఘేల్ ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలను నిర్వహించడం చర్చనీయాంశమైంది.
పలు చోట్ల..
రాయపూర్, బిలాయ్ లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం అందలేదు. భూపేష్ భఘేల్ కు చెందిన స్నేహితులు, సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారు.