Breaking : హర్యానా ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమందంటే?
హర్యానా ఎన్నికల ఫలితాల పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది.
హర్యానా ఎన్నికల ఫలితాల పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. హర్యానా ఎన్నికల ఫలితాల్లో తమకు అనుమానాలున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలన్నారు.
అభ్యంతరాలుంటే...
హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎలాంటి అభ్యంతరాలున్నా నిరభ్యంతరంగా తెలియజేయవచ్చని, తాము పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈవీఎంలపై అపోహలుంటే వాటిని తొలగించడానికి కూడా తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కాంగ్రెస్ కు రాసిన లేఖలో ఎన్నికల కమిషన్ తెలిపింది. మరి కాంగ్రెస్ అభ్యంతరాలు తెలియజేస్తుందా? లేదా? అన్నది చూడాలి.