ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఇలా
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాంఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపారు. ఈ రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని తెలిపింి. ఈనెల 14న ఉత్తర్ ప్రదేశ్ లో తొలి దశ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు.
మార్చి 10న కౌంటింగ్....
తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10వ తేదీన జరుగుతుంది. యూపీలో ఫిబ్రవరి 10, 14, 23,27, మార్చి 3,7 ఆరుదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. మణిపూర్ లో ఫిభ్రవరి 27, మార్చి 3వ తేదీన రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి పదోతేదీన అన్ని రాష్ట్రాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది.