అక్కడ ఎన్నికల కోడ్.. మళ్లీ ఎన్నికల హడావిడి మొదలయింది
కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రాష్ట్రాలకు సంబంధించి శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. హర్యానా, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రాష్ట్రాలకు సంబంధించి శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. హర్యానా, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతల సమస్య దృష్ట్యా మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సెప్టంబరు 18న తొలిదశ, రెండో దశ 25న, మూడో దశ అక్టోబరు 1న జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి దశ ఎన్నికలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
అక్టోబరు 4న ఫలితాలు...
సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందు నుంచే నిఘాను పెంచనున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు దశాబ్దకాలం తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక హర్యానాలోనూ అక్టోబరు 1వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాల కౌంటింగ్ అక్బోబరు 4 తేదీన వెలువడతాయి. అక్టోబరు 6వ తేదీ వరకూ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.