ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్?
ఐదు రాష్ట్రాల ఎన్నికలు సరైన సమయానికే నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించే అవకాశముంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు సరైన సమయానికేన నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించే అవకాశముంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. అయితే అన్ని రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలను అనుసరించి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
పార్టీలు మాత్రం.....
అలహాబాద్ కోర్టు మాత్రం ఎన్నికల నిర్వహణను పరిశీలించాలని కోరింది. ఒమిక్రాన్, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అన్ని పార్టీలు కోరుతుండంతో ఎన్నికల నిర్వహణకే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపే అవకాశముంది.