ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నేడు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూలును ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనుంది.
కోవిడ్ నిబంధనలతో....
ఈ ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ గడువు ముగిసిపోతుండటంతో ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయింది. కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కొంత ఆందోళన వ్యక్తమయింది. దీనిపై ఇప్పటికే కమిషన్ ఆ యా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను అథ్యయనం చేసి వచ్చింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ నిర్వహించాలని, భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ లను ధరించి పోలింగ్ లో పాల్గొనేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోనుంది.