అగ్నిపథ్ ను అర్థం చేసుకోవాలంటున్న కేంద్ర ప్రభుత్వం

‘అగ్నిపథ్’ పథకం వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అభ్యర్థుల వయో

Update: 2022-06-17 07:16 GMT

అగ్నిపథ్‌ ఆందోళనపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని, అగ్నిపథ్‌ వల్ల యువతకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు భద్రతను పెంచింది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించింది.

'అగ్నిపథ్' పథకం విషయంలో రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 'అగ్నిపథ్' పథకం వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్లు పెంచింది. తొలుత 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువకులు ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఈ వయో పరిమితి ఈ సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతందని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఆర్మీలో కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సాయుధ బలగాల్లోకి మున్ముందు మరింత మందిని తీసుకుంటామని..ప్రస్తుత నియామకాలను మూడు రెట్లు చేస్తామని కేంద్రం వెల్లడించింది.


Tags:    

Similar News