మరోసారి కరోనా ఆంక్షలను పొడిగించిన కేంద్రం
కరోనా ఆంక్షలను వచ్చే నెల 25వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా ఆంక్షలను వచ్చే నెల 25వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కోవిడ్ కేసులు తీవ్రమవుతున్న దృష్ట్యా కోవిడ్ ఆంక్షలను ఫిబ్రవరి 25వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రాలకు లేఖ...
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో రోజుకూ దాదాపు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. నైట్ కర్ఫ్యూను విధించాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలతో పాటు మెట్రో నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.