మూడు యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం
నిరాధారమైన, అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న మూడు యూ ట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది
నిరాధారమైన, అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న మూడు యూ ట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూస్ హెడ్ లైన్స్, సర్కారీ అప్డేట్స్, ఆజ్తక్ లైవ్ పేరుతో నిర్వహిస్తున్న మూడు యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించినట్లు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
తప్పుడు వార్తలు...
ఈ యూట్యూబ్ ఛానెళ్లకు మొత్తం 33 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారని తెలిపింది. ఈ మూడు ఛానెళ్లు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఈవీఎం, ఆధార్, పాన్ కార్డులతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల గురించి అసత్య ప్రచారాన్ని వెల్లడించడంతోనే చర్యలు తీసుకున్నామని వివరించింది.