బీఎస్ఎన్ఎల్ పై కేంద్రం వరాలు

ప్రభుత్వ రంగ సంప్థ బీఎస్ఎన్ఎల్ ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Update: 2022-07-27 12:32 GMT

ప్రభుత్వ రంగ సంప్థ బీఎస్ఎన్ఎల్ ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. బ్యాంకుల నుంచి తీసుకున్న 33 వేల కోట్ల రుణాలను ఈక్కిటీగా మలచనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థను అభివృద్ధి చేయడం కోసం 1.64 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న 33 వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించేందుకు సార్వభౌమ బాండ్లను బీఎస్ఎన్ఎల్ జారీ చేయనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.

మూడు అంశాలు...
బీఎస్ఎన్ఎల్ సేవలను మెరుగుపర్చడం, బ్యాలెన్స్ షీట్ పై భారాన్ని తగ్గించడం, ఫైబర్ నెట్ వర్క్ ను విస్తృతం చేయడం వంటి అంశాలు ఈ ప్యాకేజీలో ముఖ్యభాగమని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. 4జీ సర్వీసులను వేగంగా విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్ కు ప్రభుత్వమే స్పెక్ట్రమ్ కేటాయించిందని ఆయన తెలిపారు. అలాగే భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ ను బీఎస్ఎన్ఎల్ లో విలీనం చేయనున్నట్లు తెలిపారు. బీఎఎస్ఎన్ఎల్ ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడం శుభపరిణామమని కార్మిక సంఘాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.


Tags:    

Similar News