భారత్‌కు మరో 12 చీతాలు
చీతాల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ కు త్వరలోనే మరో 12 చీతాలు రానున్నయాని అధికారులు తెలిపారు
దేశంలో చీతాల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ కు త్వరలోనే మరో 12 చీతాలు రానున్నయాని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఈ చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు.
ఇప్పటికే ఎనిమిది...
తొలి విడతలో ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది సెప్టంబరు 17వ తేదీన ఎనిమిది చీతాలను నమీబియా ను ంచి తెప్పించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో వీటిని వదిలిపెట్టారు. ప్రస్తుతం తెచ్చే చీతాలను కూడా అదే పార్కులో విడిచిపెడతామని, చీతాల సంఖ్యను పెంచేందుకు మరిన్ని రప్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగానే వాటిని రప్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు.