విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయలో చేరాలంటే?
జవహర్ నవోదయ పాఠశాలల్లో చేరాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
జవహర్ నవోదయ పాఠశాలల్లో చేరాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నవోదయ విద్యాలయాల్లో ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం పొడిగించడంతో కొంత ఊరట దక్కినట్లయింది. విద్యార్థుల కోరిక మేరకు గడువు పొడిగించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఖాళీలు భర్తీ చేయడానికి...
నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుల చేశారు. వచ్చే నెల 9వ తేదీలోగా విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఏపీలో పదిహేను, తెలంగాణలో తొమ్మిది జవహర్ నవోదయ విద్యాలయాలున్నాయి. అయితే నవోదయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ఈ సీట్లకు డిమాండ్ అధికంగా ఉండనుంది.