ఉద్యోగులకు వార్నింగ్..లేటుగా వస్తే యాక్షన్ గ్యారంటీ

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విధులకు ఆలస్యంగా వచ్చే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

Update: 2024-06-17 07:00 GMT

ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులు ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానంలో హాజరు వేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిత్యం ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రావడంపై అనేక ఫిర్యాదులు అందడంతో ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన సమయానికి ఆఫీసుకు రావాలని సూచించింది. లేదంటే తొలుత సెలవుగా పరిగణించాల్సి వస్తుందని, ఆ తర్వాత చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉన్నతాధికారులు సమీక్షిస్తూ...
ఎప్పటకప్పుడు ఉన్నతాధికారులు ఉద్యోగుల రాకపోకలపై ఒకకన్నేసి ఉంచాలని, పోర్టల్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పరిశీలించి తరచూ ఆలస్యంగా విధులకు హాజరవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచింది. నెలలో ఒకటి లేదారెండు సార్లు ఆలస్యంగా వస్తే చర్యలు అవసరం లేదని, ఎక్కువ సార్లు ఆలస్యమయితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని కోరింది.


Tags:    

Similar News