232 చైనా యాప్ లపై నిషేధం

చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 232 చైనా యాప్ లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2023-02-05 07:36 GMT

చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 232 చైనా యాప్ లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో కొన్ని యాప్‌ల కారణంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటూ ఎక్కువ మంది భారతీయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 138 బెట్టింగ్ యాప్ లతో పాటు 94 లోన్ యాప్ లపై నిషేధం విధించింది.

బెట్టింగ్, లోన్....
చైనా యాప్ ల ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతుండటం గమనించిన కేంద్ర ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని యాప్ ల ద్వారా ఆకట్టుకుని ఎక్కువ వడ్డీ రేట్లతో డబ్బులు గుంజుతున్నారు. ఈ యాప్ లను నిషేధించాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినపడుతుంది. వివిధ రకాల బెట్టింగ్ ల యాప్ ల పేరిట యువతను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి.


Tags:    

Similar News