కేంద్రం కీలక నిర్ణయం.. ఐదేళ్ల వయో పరిమితి..?

అగ్నపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో చేరే అభ్యర్థుల గరిష్ట పరిమితి మూడేళ్లకు పెంచింది.

Update: 2022-06-18 05:53 GMT

అగ్నపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో చేరే అభ్యర్థుల గరిష్ట పరిమితి మూడేళ్లకు పెంచింది. 28 అగ్నిపథ్ తొలిబ్యాచ్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. గతంలో రెండేళ్లు మినహాయింపు ఇచ్చింది. తాజాగా మూడేళ్లు ప్రకటించడంతో మొత్తంగా ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని నిర్ణయించరు. ఈ పథకంలో చేరిన అగ్ని వీరులకు సీఏఎస్ఎఫ్, అసోం రైఫిల్స్ నియామకాల్లోనూ పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. నాలుగున్నరేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామని ప్రకటించింది.

నిరసనలు వ్యక్తమవుతుండటంతో...
అగ్నిపథ్ పథకాన్ని నిరిసస్తూ దేశంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు సికింద్రాబాద్ స్టేషన్ లోనూ ఆర్మీ అభ్యర్థులు బీభత్సం సృష్టిించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం కొంత మేర దిగివచ్చింది. కొంత సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే పథకం మాత్రం కొనసాగుతున్నట్లు ప్రకటించింది. గతంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ లో ఫెయిల్ అయిన వారు కూడా అగ్నిపథ్ లో చేరవచ్చని పేర్కొంది.


Tags:    

Similar News