నేటి నుంచి వర్క్ ఫ్రం హోంకు చెక్
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటి వరకూ వర్క్ ఫ్రం హోం లో ఉన్న ఉద్యోగులు ఇకపై కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. యాభై శాతం మంది సిబ్బంది ఆఫీసులకు రావాలని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం చేయాలని గతంలో నిర్ణయించింద.ి
విధులకు హాజరుకావాల్సిందే....
అయితే ఈ ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అందరూ నేటి నుంచి ఖచ్చితంగా విధులకు కార్యాలయాలకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా కేసులు తగ్గుతుండటం, ఒమిక్రాన్ తీవ్రత పెద్దగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.