కరోనా కనికరించనుందా?
భారత్ లో కరోనా వైరస్ బారిన పడి 23 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ అధిక సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే భారత్ లో 4,777 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా బారిన పడి 23 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఒక్కరోజులోనే 5,196 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ శాతం 98.72 శాతం పెరగినా, యాక్టివ్ కేసులు సంఖ్య 0.10 శాతంగా నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు.
యాక్టివ్ కేసులు తగ్గినా....
భారత్ లో ఇప్పటి వరకూ 4,45,68,114 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో 4,39,95,610 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 5,28,510 మరణించారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 43,994 కు చేరుకుంది. అయినా ముప్పు తప్పలేదంటున్నారు. వైద్య నిపుణులు. జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పటి వరకూ దేశంలో 217.56 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.