సోషల్ మీడియాలో కొత్త రూల్స్.. ఇన్ఫ్లూయన్సర్లు జర జాగ్రత్త !

ఇన్ ఫ్లుయెన్సర్ తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలను అంటే ఒక బ్రాండ్ కు సంబంధించిన ప్రొడక్ట్ ను సపోర్ట్ చేస్తూ

Update: 2023-01-22 08:15 GMT

social media influencers

సోషల్ మీడియా.. ఈ ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతిఒక్కరూ.. సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. కొందరు వీడియోలు, ఫన్నీ థింగ్స్, డ్యాన్సులు, డైలీ రొటీన్ లు చేసేవారైతే.. మిగతా వారంతా వాటిని చూస్తుండిపోతారు. భారత్ లో టిక్ టాక్ బ్యాన్ చేశాక.. దానిని మరిపించేలా.. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫారమ్ లతో పాటు మరికొన్ని దేశీ యాప్స్ యూజర్ల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేశాయి. ఫలితంగా.. అందం, ట్యాలెంట్ ఉన్నవారికి మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు వస్తున్నారు. వారినే సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు అని పిలుస్తున్నారు.

తాజాగా.. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్తరూల్స్ తీసుకొచ్చింది. ఆ ఇన్ ఫ్లుయెన్సర్ తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలను అంటే ఒక బ్రాండ్ కు సంబంధించిన ప్రొడక్ట్ ను సపోర్ట్ చేస్తూ చేసే వీడియోల్లో వాటి ఒప్పంద వివరాలను (పెయిడ్ ప్రమోషన్) వెల్లడించాల్సిందే. లేని పక్షంలో.. రూ.50లక్షల జరిమానా విధించే అవకాశాలున్నాయి. వాటిని బ్యాన్ చేసే అవకాశాలూ ఉన్నాయి. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు నివారించేందుకు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కొత్తరూల్స్ తెచ్చింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుయెన్సర్లు, వర్చువల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు ఎన్ డోన్ మెంట్స్ నో హౌస్ పేరుతో గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సూచించింది.


Tags:    

Similar News