చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్

చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అయింది.

Update: 2023-08-23 12:41 GMT

చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అయింది. ఎన్నాళ్ల నుండో ఎదురుచూసిన ఘట్టం ఆవిష్కృతమైంది. జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేడు చంద్రుడ్ని ముద్దాడింది. విక్రమ్ ల్యాండర్ నిర్దేశిత ప్రాంతానికి సాయంత్రం 5.44 గంటలకు చేరుకుంది. అనుకున్న సమయానికి ల్యాండింగ్ జరిగిపోయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తల్లోనూ.. దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి.


Tags:    

Similar News