అక‌స్మాత్తుగా అకౌంట్‌లో వ‌చ్చి ప‌డ్డ‌ రూ.753 కోట్లు.. వెంట‌నే ఏం చేశాడంటే..

చెన్నైలోని ఓ ఫార్మసీ ఉద్యోగి తన బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమ అయినట్లు గుర్తించాడు.

Update: 2023-10-08 11:59 GMT

చెన్నైలోని ఓ ఫార్మసీ ఉద్యోగి తన బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమ అయినట్లు గుర్తించాడు. మహమ్మద్ ఇద్రీస్ తన కోటక్ మహీంద్రా బ్యాంకు ఖాతా నుంచి శుక్రవారం 2000 రూపాయలను స్నేహితుడికి బదిలీ చేశాడు. ఈ లావాదేవీ తర్వాత.. బ్యాంక్ బ్యాలెన్స్ మెసేజ్ రాగా అందులో రూ. 753 కోట్ల మొత్తం ఉన్న‌ట్లు కనిపించింది. వెంట‌నే బ్యాలెన్స్ చెక్ చేసిన ఇద్రీస్.. అంత బ్యాలెన్స్ ఉండ‌టాన్ని చూసి అవాక్క‌య్యాడు. అయితే.. బ్యాలెన్స్‌పై ఇద్రిస్ బ్యాంక్ అధికారుల‌కు వెంట‌నే స‌మాచార‌మిచ్చాడు. దీంతో అతని ఖాతాను అధికారులు ఫ్రీజ్ చేశారు.

తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. గతంలో చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ తన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఖాతాలో రూ.9,000 కోట్లు బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించాడు. సమస్యను లేవనెత్తిన తర్వాత.. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పరిస్థితిని సరిదిద్దింది. అదనపు డబ్బును వెనక్కి తీసుకుంది. తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో రూ. 756 కోట్లు దొరకడంతో కంగుతిన్న మరో ఘటన చోటుచేసుకుంది.


Tags:    

Similar News