ప్రజ్ఞానందకు చెన్నైలో ఘన స్వాగతం....

చెన్నై విమానాశ్రయంలో ఇండియన్ గ్రాండ్ మాస్టర్,ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్ రన్నర్ రమేష్ బాబు ప్రజ్ఞానందకు అధికారులు ఘనస్వాగతం పలికారు.

Update: 2023-08-30 13:37 GMT

ప్రజ్ఞానందకు చెన్నైలో ఘన స్వాగతం....

చెన్నై విమానాశ్రయంలో ఇండియన్ గ్రాండ్ మాస్టర్,ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్ రన్నర్ రమేష్ బాబు ప్రజ్ఞానందకు అధికారులు ఘనస్వాగతం పలికారు. కప్ గెలవడం, ఇక్కడి మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రజ్ఞానంద తెలిపారు. అనంతరం ఆయనను సీఎం కార్యాలయానికి ర్యాలీగా తీసుకెళ్లారు. సీఎం స్టాలిన్ ఆయనకు రూ.30 లక్షల చెక్ ను కానుకగా అందించారు.

ఆనంద్ మహీంద్రాకు థాంక్స్ ..

సామాజిక సమస్యలపై కూడా సోషల్‌ మీడియా వేదికగా వాణిజ్యవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తుంటారాయన. దేశంలో ఏదైనా రంగంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి తనదైన శైలిలో బహుమతులు ఇచ్చి సత్కరిస్తుంటారు. అయితే తాజాగా ఇండియన్ గ్రాండ్ మాస్టర్,ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్ రన్నర‌ప్ రమేష్ బాబు ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి ఎలక్ట్రిక్ కారు బహుమతిగా ప్రకటించారు. ప్రజ్ఞానందను సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు ఈ బహుమతి ఇస్తున్నానంటూ ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్రాకు ప్రజ్ఞానంద‌ థ్యాంక్స్‌ చెప్పారు.

మంగళవారం ప్రజ్ఞానంద‌ చేసిన ట్వీట్ లో.."ధన్యవాదాలు తెలిపేందుకు నాకు మాటలు కూడా రావడం లేదు. ఈవీ కారు కొనుగోలు చేయాలన్నది నా తల్లిదండ్రుల చిరకాల కల. దాన్ని నిజం చేసినందుకు ఆనంద్‌ మహీంద్రా సర్, రాజేశ్‌ సర్‌కు చాలా థ్యాంక్స్‌" అని తెలిపాడు. ఈ ట్వీట్‌ కు స్పందించిన ఆనంద్ మహీంద్రా..కస్టమర్ల కలలను నెరవేర్చడమే కార్ల తయారీదారుల అంతిమ లక్ష్యం అని ట్వీట్ చేశారు.

ఇటీవల అజర్ బైజాన్ దేశంలో జరిగిన చెస్‌ వరల్డ్‌ కప్‌లో(FIDE World Cup)భారత యంగ్ గ్రాండ్‌ మాస్టర్‌ రమేష్‌బాబు ప్రజ్ఞానంద(18)రన్నరప్‌ గా నిలిచాడు. ప్రజ్ఞానంద తన అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు వెళ్లాడు. అయితే ఫైనల్లో అనుభవజ్ఞుడు, నార్వే నంబర్‌వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్(32) చేతిలో ఓడిపోయాడు. కార్ల్‌సన్ విజేతగా నిలిచినా.. ప్రజ్ఞానంద అంత ఈజీగా లొంగిపోలేదు. వరుసగా రెండు ఆటలను డ్రా చేసుకుని టై వరకు తీసుకెళ్లాడు. టై గేమ్‌లో తడబడిన ప్రజ్ఞానంద ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయినా ప్రజ్ఞానందపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. 18 ఏళ్లకే వరల్డ్ కప్ చెస్ టోర్నీలో ఫైనల్ చేరిన ప్రజ్ఞానందకు మంచి భవిష్యత్ ఉందని అందరూ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ప్రజ్ఞానందకు అభినందనలు తెలిపారు.

చాలామంది నెటిజన్లు ఆనంద్ మహీంద్రాను ప్రజ్ఞానందకు కారు బహుమతిగా ఇవ్వమని కోరారు. ఆయనను కోరిన వారిలో క్రిష్లే అనే ఒక వ్యక్తి చేసిన ట్వీట్‌కి సమాధానం ఇస్తూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆనంద్ మహీంద్రా.."మీ సెంటిమెంట్‌ను అభినందిస్తున్నాము, క్రిష్లే మరియు మీలాంటి చాలా మంది ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. కానీ నాకు మరో ఆలోచన ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెస్‌ను పరిచయం చేయమని, వారికి మద్దతు ఇస్తూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి, ప్రజ్ఞానానంద తల్లిదండ్రులకు XUV4OO EVని బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నాను. శ్రీమతి నాగలక్ష్మి, శ్రీ రమేష్‌బాబు, తమ కుమారుడి అభిరుచిని పెంచి పోషించినందుకు అతనికి తమ అలుపెరుగని మద్దతునిచ్చినందుకు మా కృతజ్ఞతలు. మీరు ఏమనుకుంటున్నారు?"అని తెలిపారు. ఈ ట్వీట్ కు మహీంద్రా & మహీంద్రా సీఈవో రాజేష్ జెజురికర్‌ను కూడా ట్యాగ్ చేసి దానిపై తన ఆలోచనలను పంచుకోమని ఆనంద్ మహీంద్రా కోరారు.

Tags:    

Similar News