న్యాయవ్యవస్థపై ప్రభుత్వాల తీరు సరికాదు

న్యాయమూర్తులు తీర్పులు వెలువరించిన తర్వాత ప్రభుత్వాలు వ్యవహరించే తీరు సరిగా లేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు

Update: 2022-04-09 04:07 GMT

న్యాయమూర్తులు తీర్పులు వెలువరించిన తర్వాత ప్రభుత్వాలు వ్యవహరించే తీరు సరిగా లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను కించపర్చేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇది దురదృష్టకరమని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను కించపర్చేలా వ్యవహరిస్తుండటం పట్ల జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు.

దురదృష్టకరం....
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఐఏఎస్ అధికారి అమన్ కుమార్ పై ఛత్తీస్ ఘడ్ కోర్టు కొట్టివేయగా, దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీని విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ న్యాయవాదులు సయితం దీనిపై ఆలోచించాలని కోరారు.


Tags:    

Similar News