నేటి నుంచి చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్
దేశంలో నేటి నుంచి చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి టీకా ఇవ్వనున్నారు.
దేశంలో నేటి నుంచి చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఈరోజు నుంచి 12 - 14 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు కోవిడ్ టీకాను ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. నేటి నంచి కోవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
రెండో డోసులు...
కరోనా మూడు వేవ్ లు వచ్చిన తర్వాత దేశంలో అందరికీ వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించారు. అయితే పిల్లలకు మాత్రం అప్పట్లో మినహాయింపు ఇచ్చారు. తాజాగా పిల్లల వ్యాక్సిన్ కు కూడా అనుమతి లభించడంతో నేటి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టీకా కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి డోసు వేసిన 28 రోజులకు రెండో డోసు వేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు.