రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితులను విడుదల చేయాల్సిందే: సుప్రీం కోర్టు

Perarivalan, SC, RajivGandhi

Update: 2022-11-11 10:37 GMT

దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్‌, జైకుమార్ విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నళిని, ఆర్పీ రవిచంద్రన్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్‌ హత్య కేసులో నళిని మురుగన్, సంతన్, ఏజీ పెరారివళన్, జయకుమార్, రాబర్ట్ పాయస్, పీ రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. మేలో పెరారివళన్ జైలు నుంచి విడుదలయ్యారు. పెరారివళన్ కు నిర్దేశించిన ప్రమాణాలు మిగిలిన దోషుల విషయంలో కూడా రూపొందించబడిందని ధర్మాసనం అభిప్రాయపడింది. మిగిలిన జీవిత ఖైదీలకు AG పెరారివళన్ ను విడుదల చేస్తూ చెప్పినట్లుగా.. మే 18 2022న ఇచ్చిన తీర్పును కోర్టు వర్తింపజేసింది. 2022 మే 18న ఏజీ పెరారివళన్ ను విడుదల చేస్తూ తీర్పు చెప్పడానికి అనుసరించిన విధానం మిగిలిన దోషుల విషయంలో కూడా సరైనదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది.


Tags:    

Similar News