ప్రధానితో ముగిసిన జగన్ భేటీ.. ఏయే విషయాలపై చర్చించారంటే..
ఢిల్లీకి చేరుకున్న జగన్ కు ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న జగన్ కు ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన జగన్.. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిధులపై కూడా అమిత్ షా తో చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు అమిత్ షా తో జగన్ చర్చలు జరిపారు.
అనంతరం ప్రధాని నరేంద్రమోదీ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై జగన్ ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది. సుమారు ఒక గంట 20 నిమిషాల పాటు మోదీ జగన్ ల భేటీ కొనసాగింది. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి ఆర్థిక సహాయం, పోలవరం నిధులు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.