టాంజానియాలో ఘోరప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం
ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులున్నాయి. టాంజానియాలో అతిపెద్దనగరమైన దార్ ఎస్ సలామ్ నుండి..
ఆఫ్రికా దేశంలోని టాంజానియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న విమానం.. విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులున్నాయి. టాంజానియాలో అతిపెద్దనగరమైన దార్ ఎస్ సలామ్ నుండి ఈ విమానం బుకోబా పట్టణానికి వస్తోంది. బుకోబా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ప్రయత్నంలో.. ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న సరస్సులో కూలిపోయింది.
విమానం తోకభాగం తప్ప.. మిగతా భాగమంతా సరస్సులో మునిగిపోయింది. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది 26 మంది ప్రయాణికులను కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికుల కోసం.. అధికారులు మత్స్యకారుల సహాయంతో గాలిస్తున్నారు. ఇప్పటి వరకూ ముగ్గురు ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.